Thursday, September 17, 2026
HomeUncategorizedతిరుమల శ్రీవారి దర్శనంలో అధికారుల సూచనలు

తిరుమల శ్రీవారి దర్శనంలో అధికారుల సూచనలు

తిరుమల, 2026 మార్చి

స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నిర్దేశిత సమయంలోనే అనుమతి

స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది.

ఈ నిబంధనను సోమవారం నుండి టీటీడీ కఠినంగా అమలు చేస్తోంది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దు. అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దు.

భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments