*135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు – జులై, ఆగస్టు నాటికి అందుబాటులోకి వచ్చేలా చర్యలు!*
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
పీఎం ఈ-డ్రైవ్ తొలిదశలో 135 చోట్ల ఏర్పాటు
కారు, బైక్, ఆటోలు, భారీ వాహనాల ఛార్జింగ్‌కు సదుపాయాలు
ఏప్రిల్‌లో టెండర్లు పిలిచేందుకు నెడ్‌క్యాప్ సిద్ధం
రాష్ట్రంలో నేషనల్ హైవే వెంట 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం దశలవారీగా 444 ఛార్జింగ్ కేందాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన రూపొందించింది. వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జెన్కో, డిస్కంల దగ్గర అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను ఎంపిక చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో అధికారులు కేంద్రానికి ప్రతిపాదన కూడా పంపారు. కేంద్ర బృందం సుమారు 200 ప్రదేశాలను పరిశీలించింది.
ఒక్కొక్క ఛార్జింగ్ యూనిట్ ఏర్పాటుకు సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో 80 శాతం కేంద్రం భరిస్తుంది. మిగిలిన 20 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వ వాటాగా డిస్కంలు సమకూర్చనున్నాయి. సప్లయ్,ఆపరేషన్, ఇన్స్టలేషన్ విధానంలో 5 ఏళ్ల పాటు వీటిని న
