మా గ్రామ రోడ్డును డబుల్ రోడ్డు గా మార్చండి
తెలంగాణ
సూర్యాపేట నేరేడుచర్ల:
నేరేడుచర్ల నుండి పెంచికల్ దిన్న స్పెషల్ పంచాయతీ రోడ్డును డబల్ రోడ్డు గా మార్చాలని మంత్రి ఉత్తం ను పెంచికల్ దిన్న మాజీ సర్పంచ్, సామాజిక కార్యకర్త సుంకర క్రాంతి కుమార్ విజ్ఞప్తి చేశారు.
బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలోనే మంత్రి చొరవతో డబుల్ రోడ్డు గా శాంక్షన్ జరిగిన కొందరు అడ్డుపడటంతో తిరిగి సింగిల్ రోడ్డు గానే మారడంతో దాసారం నుండి నేరేడుచర్ల వరకు వచ్చే భారీ వాహనదారులకు, ఇతర వాహనాలకు ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారిందని ప్రజల అవసరాన్ని గుర్తించి డబుల్ రోడ్డు గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెంచికల్ దిన నుండి ఫతేపురం వరకు ఉన్న లింకు రోడ్డును పూర్తి చేసి రెండు గ్రామాల ప్రజలకు ఉపయోగపడేలా రోడ్డు నిర్మాణం చేపట్టాలని, పెంచికల్ దిన లోని గత 50 సంవత్సరాలుగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ లేక గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందడం లేదని స్టాఫ్ నర్స్ పోస్టును కల్పించి వెంటనే నియామకం జరపాలని, చుట్టుపక్క గ్రామాలకు ఉపయోగపడేలా ఉన్న పశు వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని నూతన భవన నిర్మాణాన్ని చేపట్టి గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో మంత్రికి విజ్ఞాపన పత్రం ఇచ్చినప్పటికీ నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఇప్పటికైనా మొదటి ప్రాధాన్యతలో సమస్యల పరిష్కారానికి మంత్రిగారు చొరవ చూపాలని కోరారు.
