Sunday, July 26, 2026
HomeUncategorizedటి 20 ప్రపంచ కప్

టి 20 ప్రపంచ కప్

T20 World Cup:

టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ సంజు శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. కేవలం 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో 88 పరుగులు చేసి జస్ట్ మిస్ లో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 7 బంతులు ఆడి కేవలం 9 పరుగులకే విల్ జాక్స్ బౌలింగ్ లో ఔట్ అయి.. మరోసారి తీవ్రంగా నిరాశ పర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా దూకుడైన బ్యాటింగ్ తో కేవలం18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 39 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

 

సంజు శాంసన్– ఇషాన్ కిషన్ మధ్య దాదాపు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఆదిల్ రషీద్ బౌలింగ్ లో కిషన్ ఔట్ అయినా.. తర్వాత సంజు బ్యాటింగ్ లో దూకుడు ఏమాత్రం ఆపలేదు.. కానీ విల్ జాక్స్ బౌలింగ్ లో శాంసన్ కూడా ఆఫ్ సైడ్ లో ఆడిన బాల్ నేరుగా ఫిల్ సాల్ట్ చేతిలో వెళ్లి పడింది.. దీంతో సంజు (88) డిస్మిసల్ అయ్యాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 6 బంతుల్లో 11 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్ లో స్టంప్ ఔట్ అయ్యాడు.

 

చివర్లో శివమ్ దూబే, హార్థిక్ పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్ తో భారత్ స్కోర్ చేసింది. అయితే సామ్ కర్రన్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యాకు, శివమ్ దూబే మధ్య జరిగిన చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వలన దూబే ( 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో 43 పరుగులు) రనౌట్ అయ్యాడు. దీంతో హాఫ్ సెంచరీకి అడుగు దూరంలోనే పెవిలియన్ కి చేరుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన తిలక్ వర్మ తన ట్రేడ్ మార్క్ షాట్స్ తో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 19 ఓవర్లో జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో ఏకంగా 3 సిక్సులు కొట్టిన అనంతరం క్లిన్ బౌల్డ్ అయిన తిలక్ పెవిలియన్ కి చేరుకున్నాడు. అనంతరం లాస్ట్ ఓవర్లో పాండ్యా ( 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు) రెండు సిక్సులు కొట్టిన తర్వాత రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 253 పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టగారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments