Friday, August 14, 2026
HomeUncategorizedనిరంతర శ్రామికుడు విశ్వనాథ్ సేవలకు 46 ఏండ్లు

నిరంతర శ్రామికుడు విశ్వనాథ్ సేవలకు 46 ఏండ్లు

నిరంతర శ్రామికుడు… విశ్వనాథ్

 

హోటల్ విశ్వనాథ్ సేవలు @46 ఏండ్లు

 

నేరేడుచర్ల:

 

తమిళనాడు రాష్ట్రం నుండి నేరేడుచర్లకు వచ్చి తోపుడు బండిపై ఉప్మ ,ఇడ్లీ ,దోశ అమ్మకాలు ప్రారంభించి ఉప్మా

కడుపునిండా తక్కువ ధరలకు విక్రయించి అందరి మన్ననలు పొందిన విశ్వనాథ్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణానికి బ్రతుకు తెరువు కోసం 1979 వ సంవత్సరమాలో వచ్చి నేటికి 46 సంవత్సరాలు పూర్తిచేసుకుని 47 వ సంవత్సరంలో అడుగిడి నేరేడుచర్ల ప్రధాన రహదారిపై ప్రస్తుతం చిన్న గదిలో హోటల్ నడుపుతూ 30 రూపాయల భోజనం మొదలు 100 రూపాయల వరకు అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు, సుదూర ప్రాంతాల నుండి వివిధ అవసరాల కోసం వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు రేట్లలో తన సేవలను అందిస్తూ 30,40 రూపాయలకే గుడ్డుతో పేదవాడి కడుపు నిండె ఆహారాన్ని అందిస్తూ కొందరు పేదల వద్ద ఐదు ,పది రూపాయలు తక్కువగా ఉన్న సరేలే అనే స్వభావంతో సౌమ్యుడిగా అందరి మన్ననలు పొందుతూ డాబులేని జీవితాన్ని గడుపుతూ ఉదయం అల్పాహార భోజనము మొదలు రాత్రి పది గంటల వరకు కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో ముందుకు సాగుతున్న విశ్వనాధ్ సేవలను నేరేడుచర్ల చుట్టుపక్క మండలాల ప్రజలు, బాటసారులు అభినందనలు జేజేలు పలుకుతున్నారు.

అతని నిరాటంకమైన సేవలకు క్రాంతినికేతన్ ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments