Thursday, September 17, 2026
HomeUncategorized@94 అయినా వ్యాపారంలో తగ్గని జోరు

@94 అయినా వ్యాపారంలో తగ్గని జోరు

ఉద్యోగాలు దొరకలేదని తండ్రి చాటు బిడ్డలుగా ఎదుగుతున్న వారికి ఆదర్శంగా నిలుస్తున్న వృద్ద వ్యాపారవేత్త

వయసుకు చాలెంజ్ విసురుతున్న కంది బండ

తెలంగాణ సూర్యాపేట నేరేడుచర్ల:

మండల కేంద్రంలో గత 50 ఏళ్లుగా రకరకాల వ్యాపారాలను తనకంటూ ప్రత్యేక స్థానం సంతరించుకొని 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కోకోకోలా డీలర్ చెరగని ముద్ర వేసిన కందిబండ సైదయ్య నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

గరిడేపల్లి మండలం పొడుగోడు గ్రామంలో జన్మించి చిన్న వయసులోనే కుటుంబం వ్యాపార కుటుంబం కావడంతో ఆరోజుల్లో ఒక్క వ్యాపారంతో ,ఒక్క జీతంతో కుటుంబ సభ్యులు అందరూ బతకలేని రోజుల నుండి హలో ఎక్కడ గ్రామానికి మారినప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాలేకపోవడంతో మూడు పూటల భోజనం రోజుకు 10 రూపాయల వేతనంతో విజయవాడకు వెళ్లి అక్కడ హోటల్లో కప్పు సాసర్లు కడిగి జీవితాన్ని ప్రారంభించి పై మెట్టు ఎక్కెందుకు కొన్ని సంవత్సరాల అనంతరం హైదరాబాదుకు చేరి అక్కడ కొంతకాలం పనిచేసి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ అందిన పనిని చేసుకుంటూ నేరేడుచర్ల కు చేరి వివాహానంతరం తను నమ్ముకున్న జాన్పాడు సైదులు పేరుతో జేపీఎస్ కూల్డ్రింక్, జేపీఎస్ హోటల్ , ఎలక్ట్రానిక్స్, జనరల్ స్టోర్ ఇలా అన్ని రకాల వ్యాపారాలను తన అనుభవంతో నడిపి కుటుంబాన్ని పోషించిన సైదయ్య కుటుంబ సభ్యుల బాధ్యతలానంతరం చిన్న కొడుకు వద్ద ఉంటూ వ్యాపారానికి చేదోడువాదోడుగా పనిచేస్తూ ప్రస్తుతం తనకి 94 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ఇంకా ఏదో సాధించాలి అన్న తపనతో తనకు అనుభవం ఉన్న ఎలక్ట్రానిక్స్ రంగంలో గోడ గడియారాలు, వాచీలు స్వయంగా హైదరాబాదులోని హోల్సేల్ మార్కెట్ కి వెళ్లి సరుకు తెచ్చుకొని తన పరిచయాలు సంబంధాలు, అనుభవంతో సొంతంగా వ్యాపారం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

నేటి యువత చదువుకునే వయసులో తల్లిదండ్రులు ఏ పని చెప్పకపోవడంతో వారికి సమాజం పట్ల బాధ్యత భవిష్యత్తు పట్ల బాధ్యత లేకుండా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాలు వస్తేనే ఉద్యోగాలు చేస్తూ జీవిస్తున్న ఈ రోజుల్లో ఉద్యోగం రాకుంటే ఎవరినో నిందిస్తున్నారు తప్ప ఇలా స్వశక్తితో ఏదో ఒక పని చేసి జీవనం సాగించవచ్చు అన్న సందేశాన్ని తన 94 సంవత్సరాల వయసులో చేసి చూపిస్తూ యువతకు సవాలు విసురుతున్నాడు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments