Sunday, July 26, 2026
HomeUncategorizedప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులని సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి

ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులని సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి

బాలింతలకు కిట్ల పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ కొణతం

నేరేడుచర్ల ఫిబ్రవరి 26

. నేరేడుచర్ల  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి పున్నా నాగిని ఒకేరోజు ముగ్గురికి సాధారణ ప్రసవాలు చేసి ఆదర్శ డాక్టర్ గా నిలిచారనీ నేరేేడుర్ల మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి అన్నారు.

గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకేసారి ముగ్గురు గర్భిణులకు సాధారణమైన ప్రసవాలు చేసిన సందర్భంగా వారికి ప్రభుత్వం అందించే అవసరమైన కిట్లను పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం వైద్యరంగంలో విశేష సేవలు అందిస్తుందని, వాటిలో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన ప్రతి మహిళ శిశువుకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను ప్రభుత్వం అందజేస్తుందన్నారు.

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని నేరేడుచర్లల లో ఒకేరోజు ముగ్గురు గర్భిణీలు సాధారణ ప్రసవాలు జరిగేటట్లు కృషిచేసి డాక్టర్ నాగిని ఇతర సిబ్బందిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి, తోపాటు వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, మరియు మున్సిపల్ కమిషనర్ నాగరాజు కలిసి ఎం సి హెచ్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం అద్భుత సేవలు అందించిన డాక్టర్ నాగినీ ని అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇంజమూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments