నేరేడుచర్ల
వాహనాలకు అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలి అని నేరేడుచర్ల ఎస్సై రవీందర్ తెలిపారు..
#అరైవ్_అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగా నేరేడుచర్ల మండల పరిధి హుజూర్నగర్ – మిర్యాలగూడ రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహించి వాహనదారులకు స్థానిక ప్రజలకు రోడ్డు నియమాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్లనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అని తెలిపారు. తప్పుడు మార్గంలో వాహనాలు నడపకూడదు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు ద్విచక్ర వాహనంపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.
ప్రతి వాహనానికి అన్ని రకాల అనుమతి పత్రాలు కలిగి ఉండాలని లైసెన్స్ ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.
