అందరూ బ్యాగులు మోసుకుంటూ బడికి వెళ్లే సమయంలో
నేను రైఫిల్ పట్టుకున్నాను..
న్యాయం జరగాలంటే ఎదురించడం ఒక్కటే మార్గమని నమ్మాను…
ఆ నాటి సంఘర్షణలే ధైర్యాన్ని, అంకితభావాన్ని, క్రమశిక్షణను నేర్పాయి.
కానీ అనేక పోరాటాల తరువాతే అర్థమైంది,
సమాజాన్ని మార్చాలంటే చదువే అతిపెద్ద ఆయుధమని..!
మావోయిస్టుగా ఏ బోనులో అయితే నిలబడాల్సి వచ్చిందో, చదువుకున్న తర్వాత అదే కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేయడం నా జీవితంలో ఒక గొప్ప మలుపు..!!
- విద్యా రంగంలో వస్తున్న మార్పులు ABP దేశం నిర్వహించిన ‘స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్ 2026’ లో ప్రసంగం సందర్భంగా..
