*తోటి ఉద్యోగి అని కూడా చూడకుండా లంచం అడిగాడు.. ఏసీబీకి చిక్కాడు.*
ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులే. ఒకరు రిటైర్డ్.. మరొకరు ప్రస్తుతం కొనసాగుతున్నారు.
సికింద్రాబాద్ జిహెచ్‌ఎంసి జోనల్ కార్యాలయంలో ఆడిట్ అధికారిగా సంతోష్ పనిచేస్తున్నాడు.
జిహెచ్‌ఎంసి కార్యాలయంలోనే పనిచేసి రిటైర్ అయిన ఆంజనేయులు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయి డబ్బుల కోసం గత ఆరు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అందుకు ఆడిట్ అధికారి సంతోష్ రూ.40 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
బాధితుడు ఆంజనేయులు.. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ సూచన మేరకు రూ.35 వేల లంచం ఇస్తుండగా సంతోష్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
