కేటీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు
- తెలంగాణ:
ఢిల్లీ లిక్కర్ కేసు వల్లే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్న కేటీఆర్ ట్వీట్పై కవిత తీవ్రంగా స్పందించారు. “నాపై కేసు పెట్టింది పార్టీ కోసం కాదా? ఓటమికి నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదు” అని మండిపడ్డారు. ” మిమ్మల్ని ప్రజలే వద్దన్నారని ఒప్పుకోండి” అని కేటీఆర్కు గట్టిగా హితవు పలికారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు.
