తెలంగాణ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల:
సాయం అందించేందుకు ఎల్లవేళలా నేనున్నా అంటూ ప్రతి సందర్భంలోనూ సాయం అవసరం ఉన్న ప్రతి చోట తన వంతు సహకారం అందిస్తూ వస్తున్నారు జిన్నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి.
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉమ్మడి నేరేడుచర్ల మండల ముసి ఒడ్డు సింగారం లో జన్మించిన శ్రీనివాస్ రెడ్డి న్యాయవాద విద్యను అభ్యసించి వృత్తిపరంగా సేవలందిస్తూనే కాంగ్రెస్ పార్టీలో గత మూడు దశాబ్దాలుగా సేవలందిస్తూ వైఎస్ కుటుంబ సభ్యులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి హుజూర్నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాల్లో తన వంతు సహకారం అందిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులుగా సేవలందిస్తూ వస్తున్నారు.
రాజకీయాల్లో ఉన్నత పదవులకు అన్ని అర్హతలు ఉన్నా రాజకీయ సమీకరణల నేపథ్యంలో సరైన అవకాశాలు లభించకున్నా ప్రజాసేవలో నేనున్నానంటూ ఇటు రాజకీయంగా, వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో ప్రత్యేక స్థానాన్ని పొందుతున్నారు.
నేరేడుచర్ల మండల కేంద్రంలో చింతబండ వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ లేక అక్కడి ప్రయాణికులకు బస్సు నిలుపుదల చేయక అసౌకర్యంగా ఉండడంతో, అక్కడివారు తన దృష్టికి తీసుకురాగా ఆర్టీసీ ఆర్ఎం తో మాట్లాడి రిక్వెస్ట్ బస్ స్టాప్ సూచికను ఏర్పాటు చేసి వారి సమస్యను తీర్చారు.
చిన్న సమస్య మొదలు, విద్య, ఆరోగ్యం, క్రీడలు, శుభకార్యాలు, ఆ శుభకార్యాలు, రాజకీయ అవసరాలు అనేకమందికి సహకార అందిస్తూ వస్తున్న జిన్నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు మంచి ఉన్నత అవకాశాలు కల్పించాలని అభిమానులు కోరుతున్నారు.
