Friday, September 18, 2026
HomeUncategorizedనిరాడంబర కామ్రేడ్ మాజీ ఎమ్మెల్యే మృతి

నిరాడంబర కామ్రేడ్ మాజీ ఎమ్మెల్యే మృతి

*రెండు సార్లు MLA అయినా సాధారణ జీవితం..*

గ్రామాల్లో సర్పంచ్‌గా గెలిచినవారే.. ఆస్తులు కూడబెడుతున్నారు.ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే..ఇక తరాలకు సరిపడా సంపాదిస్తున్నారు.అలాంటిది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. రూపాయి కూడబెట్టుకోలేదు.ప్రజలే ఆస్తిగా..వారి శ్రేయస్సు కోసమే పని చేశారు.ఒకానొక దశలో కుమారుడికి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక దూరం చేసుకున్నాడు.ఇప్పటికీ ఓ చిన్న ఇంట్లో,వచ్చే పెన్షన్‌‌తోనే జీవితం గడుపుతున్న ఈ మాజీ ఎమ్మెల్యే నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శం.

రెండుసార్లు మాజీ ఎమ్మెల్యే
అయినా ఇప్పటికీ సాధారణ జీవితం
నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శం
వార్డు మెంబర్ నుంచి మెుదలుకొని పార్లమెంట్ మెంబర్ వరకు ప్రస్తుత కాలంలో ఒక్కసారి ప్రజా ప్రతినిధిగా గెలిస్తే చాలు హంగూ ఆర్భాటాలతో ఎక్కడలేని హడావుడి చేస్తుంటారు. ఎమ్మెల్యే ఆ పై స్థాయి నేతలు తరాలకు సరిపడా సంపాదిస్తారు.కానీ ఆయన మాత్రం అందుకు విరుద్ధం.రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి..ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారు.ఆస్తిపాస్తులు కూడబెట్టుకోకుండా ప్రజలే ఆస్తిగా బతికారు.120 గజాల ఇళ్లు,సాధారణ కారు తప్ప ఆయనకు ఆస్తులు ఏమీ లేవు.ప్రభుత్వం నుంచి పెన్షనే జీవనాధారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments