అనితరసాధ్యుడు…..సాముల రామిరెడ్డి
అనుకున్నది సులువుగా వదలడు, ఆడో , పేడో తేల్చుకోనిదే వెనుకకు తిరుగుడు, అనుకున్న లక్ష్యాలను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు న్యాయవాది సాముల రామిరెడ్డి.
తెలంగాణ రాష్ట్ర సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అమరవరం గ్రామంలో జన్మించిన సాముల రామిరెడ్డి న్యాయవాద విద్యను విద్యను అభ్యసించి హుజూర్నగర్ బార్ అసోసియేషన్ లో సభ్యుడిగా న్యాయవాది గా తన ప్రయాణాన్ని సాగించి హుజుర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా 20 సంవత్సరాల పైగా సేవలందించి అమరవరం గ్రామ సింగిల్ విండో చైర్మన్ గా పనిచేసి, వారి ధర్మపత్ని అదే గ్రామానికి సర్పంచ్ గా సేవలందించి రాజకీయంగా రాష్ట్ర ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడుగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పోటీలో విజయ దుందుభి మోగించి బార్ కౌన్సిల్ సభ్యుడిగా విజయం సాధించిన మొదటిసారి తన సొంత గడ్డ హుజూర్నగర్ స్వగృహానికి విచ్చేసిన సందర్భంగా సహచర హుజూర్నగర్ న్యాయవాదులు, పలు పార్టీల రాజకీయ నాయకులు, వేద పండితుల ఆశీర్వచనాల నడుమ ఘనంగా సన్మానించారు.
మరిన్ని పదవులు అలంకరించాలని,, రాజకీయంగా ముందుకు సాగాలని ఉన్నత పదవులు పొందాలని ఆశీర్వదించారు.
