- దాతల సహకార అభిమనందనీయం
నేరేడుచర్ల
పాఠశాల అభివృద్ధి కోసం దాతల సహకారం
మరువలేనిదని పెంచికల్ దిన సర్పంచ్ చిన్న సోములు అన్నారు. మంగళవారం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెంచికల్ దిన్నె నందు పారుపల్లి అనిల్ కుమార్ మరియు తక్కెలపాటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సహకారంతో ఒక లక్ష 40 వేల రూపాయల వ్యయంతో నిర్మించబడిన తరగతి గదిని పెంచికల్ దిన్నె సర్పంచ్ నర్సింగ్ చిన్న సోములు ప్రారంభించారు . అనంతరం ప్రధానోపాధ్యాయులు ఎల్. శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో దాతల సహకారం మరువలేనిదని కొని యాడారు . అనంతరం దాతల్ని సన్మానించడం జరిగింది. పూర్వ విద్యార్థులు ,దాతలు ఇంకా ముందుకు వచ్చి సహకరించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో వల్లంశట్ల వెంకటేశ్వరరావు వల్లంశట్ల కోటేశ్వరరావు సుంకరి వెంకటేశ్వరరావు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు రాఘవరెడ్డి గోపయ్య శ్యాంసుందర్రావు అనిల్ కుమార్ సైదులు శ్రీనివాస్ రెడ్డి ఏసు పాదం లింగయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు
