Friday, August 14, 2026
HomeUncategorizedభారత్ లో ఇంధన కొరత లేదు

భారత్ లో ఇంధన కొరత లేదు

*తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్*

ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త.

దీనివల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారు.

ప్రస్తుతం HPCL, IOCL, BPCL వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయి. సరఫరా గొలుసు (Supply chain) ఎక్కడా ఆగలేదు.

భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు విక్రయాలు పెరిగాయి.

దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు, కానీ అది కొరత కాదు.

పెట్రోల్ లేదా డీజిల్‌ను డబ్బాల్లో, క్యాన్లలో నింపి నిల్వ చేయడం PESO నిబంధనలకు విరుద్ధం.

ఇది చాలా ప్రమాదకరం మరియు అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చు.

ప్రజలు తమకు అవసరమైనంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని అసోసియేషన్ కోరింది.

తప్పుడు వార్తలను నమ్మకండి లేదా ప్రచారం చేయకండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments