అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ దాడిని ఖండిస్తూ ప్రకటన జారీ చేసిన భారత్
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. “సార్వభౌమాధికారం కలిగిన పొరుగు దేశంపై ఇలాంటి ఆక్రమణలు/దాడులకు పాల్పడటం ప్రాంతీయ శాంతి, భద్రతకు విఘాతం కలిగిస్తుంది, పాక్ వైపు నుంచి ఇలాంటి ఆక్రమణ జరగడం ఇది మరొక ఉదాహరణ” అని పేర్కొంది. “అఫ్గానిస్థాన్ పక్షానికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మేం పునరుద్ఘాటిస్తున్నాం” అని చెప్పింది.
