Saturday, July 25, 2026
HomeUncategorizedఅభినవ ఘంటసాల... దొంతగాని వెంకటేశ్వర్లు

అభినవ ఘంటసాల… దొంతగాని వెంకటేశ్వర్లు

జానపద కళా పిపాసి. …. దొంతగాని

 

ఒకప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం గుండ్లపాడు గ్రామంలో జన్మించిన దొంతగాని వెంకటేశ్వర్లు . జానపద కళల్లో నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో బుర్రకథ, జానపద కళలు, అభినవ ఘంటసాల మధుర స్వరంతో ఆలపించే పాటలతో , తన ప్రదర్శనలతో, కళా ప్రేమికులను మెప్పిస్తూ మన్ననలు పొందుతూ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొని ఏడు పదుల వయసు దాటినా కళ్ళను బ్రతికించాలని ఇప్పటికీ తాపత్రయ పడుతూ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రదర్శనలు ఇస్తూ, తన గాన మాధుర్యంతో వివిధ స్టేజీలలో కళాభిమానులను, ప్రజలను అలరిస్తూ వస్తున్నారు.

   కృష్ణా పరివాహక ప్రాంతంలో మారుమూల పల్లెటూరు గ్రామంలో జన్మించిన దొంతగాని వెంకటేశ్వర్లు చిన్నతనంలో పశువుల కాపరిగా తమ పశువులను మేపులకు వెళ్ళినప్పుడు రేడియోలో అప్పటి సంగీత, సాహిత్యాన్ని కంఠస్థం చేసుకుని రేడియో నే ఒక గురువుగా భావించి చేసిన ఆ సాధనతో వారి గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను సైతం మెప్పించి అతని ప్రదర్శన చూసేందుకు ప్రజలు బారులు తీరే పరిస్థితులకు తన కలను మెరుగుపరుచుకున్నారు. 

   గతంలో ప్రభుత్వాలు అందించిన ప్రోత్సాహంతో వివిధ జిల్లాల్లో ప్రాంతాల్లో పలు బుర్రకథ ఇతర కళా ప్రదర్శనలతో, తన ఘంటసాలను పోలిన స్వర మాధుర్యంతో ఎన్నో పాటలను వివిధ స్టేజీలపై ఆలపిస్తూ వివిధ ప్రాంతాల ప్రజలతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల అభినందనలు పొందారు. 

     ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రైవేటు కార్యక్రమాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి అవార్డులు రివార్డులు పొంది శభాష్ అనిపించుకున్నారు. 

      ఐదు దశాబ్దాల పాటు తనకు కల మీదున్న అభిమానంతో కళా ప్రదర్శనలు ముందుకు సాగుతూ నేటి తరానికి కలను దూరం చేస్తున్న ప్రభుత్వ తీరును జీర్ణించుకోలేకపోతున్నారు. 

       మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్రస్థాయిలో అలరించే ఎన్నో ప్రదర్శనలు చేసిన తనకు ఇంకా కలపట్ల ఉన్న మమకారం ఎక్కడ ప్రదర్శనలు జరిగినా అక్కడికి వెళ్లి మరి తన ప్రతిభను చూపుతూ ప్రశంసలు పొందుతున్న ప్రభుత్వ , ప్రైవేటు పలు టెలివిజన్ సంస్థలు కలను ప్రోత్సహించేందుకు తమలాంటి వారికి అవకాశం కల్పిస్తే తమ తుది శ్వాస వరకు ప్రజలను అలరించేందుకు ప్రజలకు కళపట్ల అభిమానం పెంపొందించేందుకు పాటు పడటానికి సిద్ధంగా ఉన్నానని, ఆర్థికంగా కళాకారుడిగా దశాబ్దాలు పనిచేసిన నిలువ నీడలేని పరిస్థితి ఉందని 

ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తూ ఆదుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments